lakshmi parvathi: చంద్రబాబు మైండ్ పని చేయడం లేదనే విషయం నాకు స్పష్టంగా అర్థమవుతోంది: లక్ష్మీపార్వతి

  • జగన్ ను కనీసం పరామర్శించలేదు
  • ఎన్నికల్లోపు ఇంకెన్ని దాడులు చేయిస్తారో అనే భయం కలుగుతోంది
  • హత్యా రాజకీయాలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు

ప్రతిపక్ష నేత జగన్ దాడికి గురైతే ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం పరామర్శించలేదని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి మండిపడ్డారు. పరామర్శిస్తున్న వారిపై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు మైండ్ సరిగా పని చేయడం లేదనే విషయం తనకు స్పష్టంగా అర్థమవుతోందని చెప్పారు. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు ఇంతలా దిగజారి మాట్లాడతారని అనుకోలేదని అన్నారు. కనీసం లోకేష్ తో పరామర్శ చేయించినా... ఎంతో హుందాగా ఉండేదని చెప్పారు.

జగన్ కు ప్రజల్లో సానుభూతి వస్తుందనే భయంతో అనుకూలమైన ఛానళ్లలో రకరకాల కథనాలను చంద్రబాబు ప్రసారం చేయించారని లక్ష్మీపార్వతి విమర్శించారు. జగన్ ను అంతం చేయాలనే ప్రయత్నం జరిగిందన్న విషయం చంద్రబాబు వ్యాఖ్యలతో స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. ఎన్నికల ముందు ఇంకెన్ని దాడులు చేయిస్తారో అనే భయం తమలో నెలకొందని చెప్పారు. హత్యా రాజకీయాలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని... రాష్ట్రంలో శాంతిభద్రతలు చేజారి పోయాయని అన్నారు. ఏమాత్రం మానవత్వం ఉన్నా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు చంద్రబాబు సిద్ధం కావాలని... తమ సత్తా ఏంటో ఎన్నికల్లో చూపిస్తామని చెప్పారు. 

lakshmi parvathi
Chandrababu
lokesh
ysrcp
Telugudesam
  • Loading...

More Telugu News