jagan: జగన్ చెప్పిందే రిమాండ్ రిపోర్టులో రాశాం.. 160 సీఆర్పీసీ కింద జగన్ కు నోటీసులు ఇచ్చాం: విశాఖ పోలీస్ కమిషనర్

  • ఆంధ్ర పోలీసులను నమ్మనని చెప్పిన జగన్.. మరుసటి రోజు తన అభిప్రాయాలను చెప్పారు
  • తల తిప్పుకుని వెళ్లకపోతే.. తీవ్ర ప్రమాదం జరిగేదని చెప్పారు
  • జగన్ ను విచారణకు పిలుస్తాం

జగన్ పై దాడికి సంబంధించి విశాఖ పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దాడి జరిగిన సమయంలో తల పక్కకు తిప్పుకుని వెళ్లకపోతే మెడపై తీవ్ర గాయమయ్యేదని... అప్పుడు తీవ్ర ప్రమాదం జరిగి ఉండేదని జగన్ చెప్పారని... జగన్ చెప్పిన విషయాన్నే రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నామని ఆయన తెలిపారు. జగన్ అభిప్రాయాన్ని యథాతథంగా రిపోర్టులో రాశామని చెప్పారు.

ఘటన జరిగిన తర్వాత ఆంధ్ర పోలీసులపై నమ్మకం లేదని జగన్ చెప్పారని... కానీ మరుసటి రోజు ఆయన వద్దకు వెళ్తే ఈ వివరాలను తెలిపారని అన్నారు. జగన్ కు 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చామని... విచారణకు పిలుస్తామని చెప్పారు. ఈ విషయంలో అవసరమైతే న్యాయపరంగా ముందుకు వెళ్తామని తెలిపారు. విచారణలో మరిన్ని విషయాలు తెలుస్తాయని... ప్రత్యక్ష సాక్షులకు కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తామని చెప్పారు.

jagan
stab
visakhapatnam
police commissioner
ladda
notice
remand report
  • Loading...

More Telugu News