prabhu: కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ప్రముఖ సినీ నటుడు ప్రభు?

  • పక్కా ప్లాన్ తో రాజకీయాల్లోకి వస్తానని ఇప్పటికే ప్రకటించిన ప్రభు
  • రాహుల్ చెన్నై పర్యటన సమయంలో కాంగ్రెస్ లో చేరిక
  • ప్రభు స్నేహితురాలు ఖుష్బూ కాంగ్రెస్ లో క్రియాశీలకంగా ఉన్నారు

ప్రముఖ సినీ నటుడు ప్రభు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. రాజకీయరంగంలోకి ఆయన అడుగుపెట్టబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. తన తండ్రి శివాజీ గణేశన్ నుంచి సినీ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ప్రభు... సినీ రంగంలో సుదీర్ఘకాలం కొనసాగలేకపోయారు. ఈ నేపథ్యంలో, రాజకీయాల్లోకి రావాలని ఆయన భావిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పక్కా ప్లాన్ తో రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. తొలి నుంచి కూడా శివాజీ గణేశన్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉంది.

మరోవైపు, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తదుపరి చెన్నై పర్యటనలో భాగంగా... శివాజీ గణేశన్ ఇంటికి వెళ్లి, ఆయన చిత్ర పటానికి నివాళి అర్పించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ప్రభు చేరే అవకాశం ఉంది. ఇప్పటికే నటి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ప్రభు, ఖుష్బూల మధ్య తొలి నుంచి కూడా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ప్రభు కాంగ్రెస్ లో చేరడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పుకుంటున్నారు. 

prabhu
actor
kollywood
congress
Rahul Gandhi
khushboo
  • Loading...

More Telugu News