nithin: విభిన్న కథా చిత్రాల దర్శకుడికి నితిన్ గ్రీన్ సిగ్నల్

  • వరుస పరాజయాలతో నితిన్ 
  • వెంకీ కుడుములతో ఒక సినిమా 
  • చంద్రశేఖర్ యేలేటితో మరొకటి    

ప్రస్తుతం నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా చేసేయాలనే ఉద్దేశంతో నితిన్ వున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రశేఖర్ యేలేటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

భవ్య క్రియేషన్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించనున్నారు. ఇటీవల నితిన్ చేసిన 'లై ' .. ఛల్ మోహన్ రంగా' .. 'శ్రీనివాస కల్యాణం' సినిమాలు పరాజయం పాలయ్యాయి. అందువలన వెంకీ కుడుములతో .. చంద్ర శేఖర్ యేలేటితో చేస్తోన్న ప్రాజెక్టులపైనే నితిన్ ఆశలు పెట్టుకున్నాడు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.     

  • Loading...

More Telugu News