Sonia Gandhi: సోనియాను పెళ్లాడి రాజీవ్ గాంధీ చాలా పెద్ద తప్పు చేశారు: సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

  • మాయావతి, మమతా బెనర్జీ నాకు మంచి స్నేహితులు
  • ఎన్నికలకు ముందే సోనియా, చిదంబరం జైలుకెళ్తారు
  • సోనియా ప్రధాని కాకుండా అబ్దుల్ కలాం అడ్డుకున్నారు

హైదరాబాద్‌లో నిర్వహించిన మహిళా వాణిజ్యవేత్త(ఫిక్కీ)ల గ్రూప్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిక్కీ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన ఆయన.. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందే సోనియా గాంధీ, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం జైలుకు వెళ్తారని పేర్కొన్నారు.

ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, జయలలిత వంటి మహిళా నేతలతో మీకు శత్రుత్వం ఎందుకన్న ప్రశ్నకు స్వామి బదులిస్తూ మాయావతి, మమతా బెనర్జీ తనకు మంచి స్నేహితులని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ లాంటి వ్యక్తి సోనియాను పెళ్లాడి తప్పుచేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి రాజీవ్ చనిపోయే నాటికి ఆ దంపతుల మధ్య అంత సామరస్యపూరిత వాతావరణం లేదన్నారు.  

దేశంలో ఆదాయం కోసం ఇతర మార్గాలను అన్వేషించాల్సి ఉందన్న స్వామి తను కనుక ఆర్థిక మంత్రిని అయితే తొలుత రద్దు చేసేది ఆదాయపు పన్నునేనని అన్నారు. సోనియాగాంధీ ప్రధాని కాకుండా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 90 శాతం అడ్డుకున్నారని, తానో పది శాతం కృషి చేశానని అన్నారు. ఆ విషయం తెలిసే కలాం రెండోసారి రాష్ట్రపతి కాకుండా సోనియా అడ్డుకున్నారన్నారు.

Sonia Gandhi
Subramanian swamy
BJP
Congress
Rajiv Gandhi
Chidambaram
  • Loading...

More Telugu News