Mahesh Chandra Ladda: జగన్‌పై దాడి కేసులో కీలక విషయాలను వెల్లడించిన సీపీ

  • కత్తిని హోటల్ వంట గదిలో దాచాడు
  • మూడు బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నాం
  • ఇతరులతో లేఖ ఎందుకు రాయించాడో తెలుసుకుంటాం

వైసీపీ అధినేత జగన్‌పై దాడి కేసులో కీలక విషయాలను విశాఖ సీపీ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు. శ్రీనివాసరావు కత్తిని జనవరిలోనే కొనుగోలు చేశాడని.. దానిని హోటల్ వంటగదిలో దాచాడని ఆయన స్పష్టం చేశారు. శ్రీనివాసరావుకు ఉన్న మూడు బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.

శ్రీనివాసరావు ట్యాబ్ కూడా వినియోగించేవాడని.. దానిని స్వాధీనం చేసుకుంటామని లడ్డా పేర్కొన్నారు. జగన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీనివాసరావు ఫ్లెక్సీలు వేయించాడని సీపీ స్పష్టం చేశారు. తన దస్తూరి బాగుంటుందని.. అయినా ఇతరులతో లేఖ ఎందుకు రాయించాడో తెలుసుకుంటామన్నారు. శ్రీనివాసరావుతోపాటు పని చేస్తున్న వారిని కూడా విచారించినట్టు లడ్డా స్పష్టం చేశారు.

Mahesh Chandra Ladda
Srinivasa Rao
Bank Accounts
Jagan
  • Loading...

More Telugu News