Nara Lokesh: ఇంత నీచ రాజకీయం చేసే వ్యక్తి జగన్‌ మోడీ రెడ్డి తప్ప మరొకరుండరు: లోకేశ్

  • మీరు మారరు.. మీ నాయకుడు మారరు
  • వైసీపీ ట్రేడ్ మార్క్ మార్ఫింగ్ ట్రిక్స్
  • చీప్ ఫోటోషాప్ గిమ్మిక్కులు

సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు కొత్త పోస్టర్ హల్‌చల్ చేస్తోంది. శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్తేనంటూ.. మెంబర్ షిప్ కార్డ్ ఒకటి నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అంకాలు నంబూరి అనే వ్యక్తి కార్డుకు సంబంధించిన నంబర్‌ను శ్రీనివాసరావుదిగా వైసీపీ నేతలు మార్చారని.. అవన్నీ ఫోటోషాప్ గిమ్మిక్కులని వెల్లడించారు. ‘మీరు మారరు.. మీ నాయకుడు మారరు’ అంటూ వైసీపీ నేతలను లోకేశ్ ఎద్దేవా చేశారు.

ట్విట్టర్‌లో వరుస ట్వీట్లతో వైసీపీపై లోకేశ్ ధ్వజమెత్తారు. ‘‘వైసీపీ ట్రేడ్ మార్క్ మార్ఫింగ్ ట్రిక్స్. దాడి చేసింది తన అభిమానే అని ఒప్పుకునే ధైర్యం లేని నాయకుడు జగన్ మోడీ రెడ్డి. తన అభిమానిని టీడీపీ కార్యకర్తగా చిత్రిస్తూ చీప్ ఫోటో షాప్ గిమ్మిక్కులు. కనీస అవగాహన కూడా లేకుండా ముమ్మిడివరం మండలం అమలాపురం నియోజకవర్గంలోనిది అంటూ ఫేక్ మెంబెర్ షిప్ కార్డ్ తయారు చేశారు. ఇంత నీచ రాజకీయం చేసే వ్యక్తి జగన్ మోడీ రెడ్డి తప్ప మరొకరు ఉండరు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Nara Lokesh
Jagan Modi Reddy
Photoshop
YSRCP
Srinivasa Rao
Ankalu Namburi
  • Loading...

More Telugu News