Budda venkanna: కోడి కత్తి ఎపిసోడ్‌కు మోదీయే దర్శకుడు.. కన్నా ఇంట్లో దొంగ సొత్తు ఉంది: బుద్ధా వెంకన్న

  • కన్నా ఇంటిపై బీజేపీ జెండా.. ఇంట్లో వైసీపీ జెండా
  • కోడికత్తితో ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారు
  • తనిఖీలు నిర్వహిస్తే దొంగ సొత్తు దొరుకుతుంది

టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన విమర్శలు చేశారు. విజయవాడలో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ దర్శకత్వంలో కోడి కత్తి ఎపిసోడ్ నడిచిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పైకి బీజేపీ జెండాతో కనిపించినా, ఇంట్లో మాత్రం వైసీపీ జెండా పెట్టుకున్నారని విమర్శించారు.

 కన్నా, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల నాని కుమారులిద్దరూ ఒకే సంస్థలో డైరెక్టర్లుగా పనిచేస్తున్నారని కన్నాకు వైసీపీతో ఉన్న బంధానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. కన్నా ఇంట్లో దొంగసొత్తు ఉందని తెలిపిన బుద్దా వెంకన్న తనిఖీలు నిర్వహిస్తే బయటపడుతుందని ఆరోపించారు. చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వైసీపీ కోడి కత్తి ఎపిసోడ్‌ని ఆసరాగా తీసుకుందని విమర్శించారు.  

Budda venkanna
Narendra Modi
YSRCP
Kanna Lakshmi Narayana
Alla Nani
  • Loading...

More Telugu News