KTR: కేసీఆర్ ను చంద్రబాబు అంటారు.. చంద్రబాబును కేసీఆర్ అంటారు... ఇదంతా సాధారణ విషయమే!: కేటీఆర్

  • రాజకీయాల్లో విమర్శలు సాధారణ అంశం
  • చచ్చిపోయిన పాములాంటి కాంగ్రెస్.. చంద్రబాబును చూసుకొని ఎగురుతోంది
  • కాంగ్రెస్ కు చంద్రబాబు ఆక్సిజన్ అందిస్తున్నారు

ఏపీ మంత్రి నారా లోకేష్ ను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను హైదరాబాదులో చదువుకున్నానని... నీవు గుంటూరులో చదువుకున్నావని లోకేష్ బాబు అన్నారని చెప్పారు. రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణలు, విమర్శలు సర్వసాధారణమని అన్నారు.

'చంద్రబాబును కేసీఆర్ అంటారు. కేసీఆర్ ను చంద్రబాబు అంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇంకొకరు అంటారు. ఇంకొకరు ఆయనను అంటారు. గడ్డాల గురించి మాట్లాడుకుంటాం. ఇంకో విషయం గురించి మాట్లాడుకుంటాం. ఇలా చాలా ఉంటాయ్' అని సరదాగా వ్యాఖ్యానించారు. ఇవన్నీ రాజకీయల వరకే పరిమితమని... దీన్ని ప్రజల కోణంలో నుంచి చూడరాదని చెప్పారు. హైదరాబాద్ నిజాంపేటలో నిర్వహించిన 'హమారా హైదరాబాద్' కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గత నాలుగేళ్లలో ప్రజలందరినీ సమానంగానే చూశామని, ఎలాంటి ప్రాంతీయ వివక్షను చూపలేదని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో అందరూ లాభపడ్డారనే విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులపై ఉద్విగ్నతతో మాటల తూటాలు పేల్చుతున్నప్పుడు, కొందరికి బాధ కలగడం సహజమేనని తెలిపారు. చంద్రబాబు ప్రత్యర్థి పార్టీ అధినేత కాబట్టి, కాంగ్రెస్ కు ఆక్సిజన్ అందిస్తున్నారు కాబట్టి ఆయనపై కూడా విమర్శలు చేశామని చెప్పారు. కాంగ్రెస్ చచ్చిపోయిన పామని... ఇప్పుడు ఆ పార్టీ ఎగురుతోందటంటే దానికి కారణం చంద్రబాబే అని అన్నారు. చంద్రబాబు అండతోనే కాంగ్రెస్ నేతలు ఎగురుతున్నారని చెప్పారు. 

  • Loading...

More Telugu News