Hero Ram: పెళ్లి చేసుకోమని ఇంట్లో గోల పెడతున్నారు.. విననట్టు నటించి దాటవేస్తున్నా: హీరో రామ్

  • ‘హలో గురు ప్రేమ కోసమే..’ విజయ యాత్రలో రామ్
  • సినిమా అవగానే పెళ్లి విషయం చర్చిద్దామని దాటవేస్తున్నా
  • ఎప్పటికప్పుడు సినిమాతో ముడిపెట్టి తప్పించుకుంటున్నా

మొన్నటివరకు ఇండస్ట్రీలో రామ్ కెరీర్‌ ఒక హిట్.. ఒక ఫట్ అన్నట్టుగా సాగింది. కానీ ఇటీవల వచ్చిన ‘హలో గురు ప్రేమ కోసమే..’ చిత్రం సక్సెస్ టాక్‌తో మళ్లీ ట్రాక్ లో పడ్డాడు. ప్రస్తుతం రామ్ ఈ చిత్రం విజయాత్రలతో సరదాగా గడిపేస్తున్నాడు. ఇదిలా ఉంటే వాళ్లింట్లో రామ్‌ని పెళ్లి చేసుకోమని గోల పెడుతున్నారట. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు దాట వేస్తున్నానని రామ్ మీడియాకు తెలిపాడు.

‘‘మా ఇంట్లో పెళ్లి చేసుకోమని ఒకటే గోల పెడుతున్నారు. ‘ఎప్పుడూ సినిమాలే అంటావు. సినిమాలతోనే జీవితం గడిపేస్తున్నావు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు’ అని అడుగుతున్నారు. ఆ సమయంలో కాసేపు విననట్టు నటించి.. ప్రస్తుతం ఏమీ మాట్లాడొద్దు.. సినిమా అయిపోగానే పెళ్లి విషయాన్ని చర్చిద్దామని దాటవేస్తుంటా. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా తర్వాత చిత్రంతో ముడిపెడుతూ తప్పించుకుంటున్నా’’ అంటూ నవ్వేశాడు. 

Hero Ram
Vunnadi Okate Zindagi
Hello Guru Premakosame
Success Tour
  • Loading...

More Telugu News