amit shah: కేసీఆర్ భయపడుతున్నారు.. తెలంగాణలో ప్రభుత్వం మారబోతోంది: అమిత్ షా

  • బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని నిర్వహిస్తాం
  • అమరవీరులను టీఆర్ఎస్ ప్రభుత్వం అవమానించింది
  • బీజేపీని, మోదీని విమర్శించే అర్హత రాహుల్ కు లేదు

నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తిని కల్పించేందుకు రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భారత సైనికులు ప్రాణాలను అర్పించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కానీ, విమోచన దినం పాటించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అమరవీరులను అవమానించిందని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే... విమోచన దినాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఎంఐఎంకు ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బీజేవైఎం మహాసభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని అమిత్ షా చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వం మారబోతోందని అన్నారు. బీజేపీ గెలుపే లక్ష్యంగా బీజేపీ యవమోర్చా శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.

నాలుగున్నరేళ్లలో ప్రధాని మోదీ ఏం చేశారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారని... నాలుగు తరాల్లో మీరు చేయలేనిది నాలుగున్నరేళ్లలో తాము చేసి చూపించామని అమిత్ షా అన్నారు. బీజేపీని, మోదీని ప్రశ్నించే అర్హత రాహుల్ కు లేదని చెప్పారు. మహాకూటమికి నాయకులు లేరని... ఇలాంటి కూటమిని ప్రజలు నమ్మరని అన్నారు. 

  • Loading...

More Telugu News