Andhra Pradesh: ఆంధ్రాలో ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపై దాడులు చేయిస్తున్నారు.. చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డ కన్నా లక్ష్మీ నారాయణ

  • విపక్ష నేతలు ధైర్యంగా తిరిగే పరిస్థితి లేదు
  • ఆపరేషన్ గరుడ కర్త, కర్మ చంద్రబాబే
  • కేంద్రంపై సీఎం దుష్ప్రచారం చేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేతలు ధైర్యంగా బయటతిరిగే పరిస్థితి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలను ప్రశ్నించేవారిపై దాడులు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. అసలు ‘ఆపరేషన్ గరుడ’కు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా సీఎం చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలోని హిందూ ఫార్మసీ కాలేజీలో ఈరోజు జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

టీడీపీ నేతలు కేంద్ర ప్రభుత్వంపై అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని కన్నా మండిపడ్డారు. ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో ప్రజల్లో లేనిపోని ఆందోళనలు రేకెత్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ విషయమై న్యాయపరంగా ముందుకు వెళ్లే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వెల్లడించారు. తనకు వైసీపీతో రహస్య సంబంధాలు ఉన్నాయని టీడీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
oppisition
leaders
attacked
jagan
Telugudesam
BJP
YSRCP
Chandrababu
kanna lakshmi narayana
operation garuda
  • Loading...

More Telugu News