rakul preet singh: నా జీవితంలో ఇదే పెద్ద అచీవ్ మెంట్: రకుల్ ప్రీత్

  • చిన్నప్పటి నుంచి శ్రీదేవిని చూస్తూ పెరిగా
  • ఆమె పాత్రను పోషిస్తున్నానంటే నమ్మలేక పోతున్నా
  • నాకు ఈ అవకాశం ఇచ్చిన యూనిట్ సభ్యులకు ధన్యవాదాలు

తెలుగు సినిమాల్లో అగ్ర హీరోలందరి సరసన నటించిన ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్ కు ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయి. అయితే, ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్రలో నటించే గొప్ప అవకాశం ఆమె తలుపు తట్టింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, శ్రీదేవి అంటే తనకు ఎంతో అభిమానమని చెప్పింది. చిన్నప్పటి నుంచి శ్రీదేవిని చూస్తూ పెరిగానని తెలిపింది. అలాంటి శ్రీదేవి పాత్రను పోషిస్తున్నానంటే నమ్మలేకపోతున్నానని చెప్పింది. తన జీవితంలో ఇదే పెద్ద అచీవ్ మెంట్ అని తెలిపింది. ఈ ఆఫర్ వచ్చినప్పుడు తనకు భయం వేసిందని... అయితే, ఎలాగైనా నటించి, మెప్పించాలని శ్రీదేవి పాత్రను అంగీకరించానని చెప్పింది. ఈ పాత్రకు తనను ఎంపిక చేసిన యూనిట్ సభ్యులకు ధన్యవాదాలు చెబుతున్నానని అంది. 

rakul preet singh
sridevi
ntr
biopic
tollywood
  • Loading...

More Telugu News