arjun: శృతి హరిహరన్ ఫిర్యాదుతో.. అర్జున్ పై బెంగళూరులో కేసు నమోదు!

  • అర్జున్ తనను అసభ్యకరంగా తాకాడని ఫిర్యాదు చేసిన శృతి  
  • కేసు నమోదు చేసిన పోలీసులు
  • శుక్రవారం నాడు శృతిపై పరువు నష్టం దావా వేసిన అర్జున్

ప్రముఖ సినీ నటుడు అర్జున్ పై బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే, ఓ సినిమా షూటింగ్ సందర్భంగా తన పట్ల అర్జున్ అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ హీరోయిన్ శృతి హరిహరన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో, శృతి క్షమాపణలు చెప్పాలని అర్జున్ డిమాండ్ చేశారు. ఆమె నిరాకరించడంతో కోర్టులో కేసు వేశారు. శుక్రవారం నాడు రూ. 5 కోట్లకు పరువు నష్టం దావా వేశారు.

ఈ నేపథ్యంలో అర్జున్ పై కబ్బన్ పార్క్ పీఎస్ లో శృతి ఫిర్యాదు చేసింది. 'విస్మయ' చిత్రం షూటింగ్ సందర్భంగా రిహార్సల్స్ చేస్తుండగా అర్జున్ తనను అసభ్యకరంగా తాకాడని ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అర్జున్ పై కేసు నమోదు చేశారు.

arjun
sruthi hariharan
case
bengaluru
kollywood
tollywood
  • Loading...

More Telugu News