vijay devarakonda: విజయ్ దేవరకొండపై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్!

  • హీందీలో తెరకెక్కుతున్నఅర్జున్ రెడ్డి
  • కబీర్ సింగ్ గా టైటిల్ ఖరారు చేసిన యూనిట్
  • బెస్ట్ విషెస్ చెప్పిన విజయ్ దేవరకొండ

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా అతని కెరీర్ లోనే బెస్ట్ గా నిలిచింది. టాలీవుడ్ ను షేక్ చేసిన ఈ సినిమాను ప్రస్తుతం హిందీ, తమిళంలో తెరకెక్కిస్తున్నారు. హిందీలో షాహీద్ కపూర్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘కబీర్ సింగ్’ అనే టైటిల్ ను సైతం ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. ’కబీర్ సింగ్.. అర్జున్ రెడ్డి నుంచి మీకు బెస్ట్ విషెస్’ అని ట్విట్ చేశాడు.

దీనికి హీరో షాహీద్ కపూర్ వెంటనే స్పందించాడు.‘ఈ సినిమాలో మీ పాత్ర ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది బ్రదర్‌. ఎన్ని రీమేక్‌లు వచ్చినా నీదే ఒరిజినల్‌’ అంటూ ప్రశంసలు కురిపించాడు. షాహీద్ ట్వీట్ కు విజయ్ మళ్లీ జవాబిస్తూ..‘.‘బిగ్‌ బ్రదర్‌.. మీపట్ల నాకూ ఎంతో గౌరవం, ప్రేమ ఉన్నాయి. మీరు, సందీప్‌ కలిసి కచ్చితంగా మ్యాజిక్‌ చేస్తారు. మిమ్మల్ని కబీర్‌గా చూడాలని ఎంతో ఆత్రుతగా ఉన్నా’ అని ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో షాహీద్ కు జోడీగా ‘భరత్ అనే నేను ఫేం’ కైరా అద్వాణీ నటిస్తోంది. వచ్చే ఏడాది జూన్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

vijay devarakonda
Tollywood
arjun reddy
movie
remake
hindi
shahid kapoor
complement
praise
original
  • Loading...

More Telugu News