sadar forest: కరెంట్ షాక్ కు గురై ఏడు ఏనుగుల మృతి.. నవీన్ పట్నాయక్ ఆగ్రహం

  • సదర్ ఫారెస్ట్ రేంజ్ లో దారుణం
  • క్రైం బ్రాంచ్ విచారణకు ఆదేశం
  • పలువురు అధికారుల సస్పెన్షన్

ఒడిషాలో దారుణం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ కు గురై ఏడు ఏనుగులు దుర్మరణం పాలయ్యాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి క్రైం బ్రాంచ్ దర్యాప్తుకు ఆయన ఆదేశించారు. ఏనుగులను కావాలనే ఎవరైనా చంపారా? లేక అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం చోటు చేసుకుందా? అనే కోణంలో క్రైం బ్రాంచ్ దర్యాప్తు కొనసాగనుంది.

ఘటన వివరాల్లోకి వెళ్తే, థెన్ కెనాల్ లోని సదర్ ఫారెస్ట్ రేంజ్ లో ఈ దారుణం సంభవించింది. స్తంభాలపై నుంచి వేలాడుతున్న వైర్లు తాకి ఐదు ఆడ ఏనుగులు, రెండు మగ ఏనుగులు చనిపోయాయి. ఏనుగుల మృత దేహాలను గుర్తించిన స్థానికులు వెంటనే అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. మూడు ఏనుగుల మృత దేహాలు రోడ్డుపై పడి ఉండగా, మిగిలిన ఏనుగులు పక్కన ఉన్న కాలువలో తేలాయి. ఈ ఘటనకు సంబంధించి విద్యుత్ శాఖకు చెందిన ఆరుగురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సహా మరో ముగ్గురు ఫీల్డ్ స్టాఫ్ ను అటవీ శాఖ సస్పెండ్ చేసింది. 

  • Loading...

More Telugu News