Andhra Pradesh: వాట్సాప్ ద్వారా హైటెక్ వ్యభిచారం.. నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు, పెద్దల పేర్లు చూసి షాక్ తిన్న పోలీసులు!

  • తెలంగాణ లోని సూర్యాపేట జిల్లాలో ఘటన
  • కోదాడలో హైటెక్ వ్యభిచారం నిర్వహణ
  • నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

సాంకేతికతను వాడుతూ హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. యువతుల చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపుతూ విటులను ఆకర్షిస్తున్న నిందితుల ఆట కట్టించారు. సూర్యాపేట జిల్లాలోని కోదాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే నిందితుల ఫోన్లను పరిశీలించిన పోలీసులు.. జిల్లాలోని చాలామంది ప్రముఖులు వీరి కస్టమర్లుగా ఉండటం చూసి విస్తుపోయారు.

కోదాడలోని కట్టకొమ్మగూడెం రోడ్డులో దీక్షిత్‌, ఈశ్వరమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్న వీరు ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు యువతులతో వ్యభిచారం నిర్వహించడం మొదలుపెట్టారు. అమ్మాయిల ఫొటోలను వాట్సాప్ ద్వారా విటులకు పంపి డీల్ ఖరారు చేసేవారు. ఈ వ్యవహారంపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దీక్షిత్ ఇంటిపై దాడులు నిర్వహించారు. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఓ యువతిని రెస్క్యూ హోమ్ కు తరలించారు.

ఈ సందర్భంగా నిందితుల ఫోన్లను పరిశీలించిన పోలీసులు విస్తుపోయారు. దీక్షిత్ దంపతులు ‘రెగ్యులర్ కస్టమర్స్’ పేరుతో ఏకంగా ఓ వాట్పాప్ గ్రూపును నడుపుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, నేతలు, ప్రభుత్వ పెద్దలు, ఉన్నతస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు వీరి కస్టమర్లుగా ఉన్నట్లు గుర్తించి షాక్ కు గురయ్యారు. పలువురు ప్రముఖులు ఇందులో ఉండటంతో పోలీసులు వారి పేర్లను గోప్యంగా ఉంచుతున్నారు.

Andhra Pradesh
Telangana
whatsapp
S*x rocket
high tech
Police
arrested
rescue home
inflential people
  • Loading...

More Telugu News