Chandrababu: చంద్రబాబును కలిసిన డీఎస్.. మహాకూటమిలోకి ఆర్ఎల్‌డీ!

  • ఢిల్లీలో చంద్రబాబుతో డీఎస్ భేటీ
  • రాజేంద్రనగర్ సీటును తనకు వదిలేయాలన్న బండ్ల గణేశ్
  • రెండు సీట్లు అడుగుతున్న ఆర్ఎల్‌డీ

తెలంగాణలో జట్టు కట్టిన మహాకూటమిలోకి మరో కొత్త పార్టీ వచ్చి చేరుతోంది. రాష్ట్రీయ లోక్‌దళ్ శక్తి (ఆర్ఎల్‌డీ) మహాకూటమితో కలిసి నడిచేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. తమకు రెండు స్థానాలు కావాలని ఆ పార్టీ అడుగుతున్నట్టు తెలుస్తోంది. కాగా, ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తెలంగాణ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

అంతకుముందు కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ చంద్రబాబును కలిశారు. రాజేంద్రనగర్ సీటు కోసం టీడీపీ పట్టుబట్టకుండా చూడాలని, ఆ సీటును తాను ఆశిస్తున్నట్టు చంద్రబాబుకు తెలిపారు. ఈ విషయంలో తనకు సహకరించాల్సిందిగా కోరారు. మరోవైపు తెలంగాణలో సీట్ల విషయంలో మహాకూటమి మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. కాంగ్రెస్‌ 91, తెజస 8, తెదేపా 15, సీపీఐ 5 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. అయితే, ఏయే స్థానాల్లో అన్న విషయం ఈ నెలాఖరుకు తేలిపోనుంది.

Chandrababu
New Delhi
D.Srinivas
Bandla Ganesh
Congress
Mahakutami
Telangana
  • Loading...

More Telugu News