జగన్ చాలా కష్టపడుతున్నారు.. ఏదో ఒకరోజు సీఎం అవుతారు: సినీ నటుడు శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు
- నేను ఏ పార్టీకీ చెందిన వాడిని కాదు
- ప్రత్యేక హోదా సాధనే నా లక్ష్యం
- గతంలో చంద్రబాబును కూడా విమర్శించా
ఏపీకి ప్రత్యేక హోదా సాధనే తన లక్ష్యమన్న శివాజీ, తాను ఏ పార్టీకి చెందినవాడిని కానన్నారు. గతంలో తాను సీఎం చంద్రబాబును కూడా విమర్శించానన్నారు. ఆ సమయంలో వైసీపీ నేతలు తనను సంప్రదించారని, తమతో కలసి రావాలని అడిగారని వెల్లడించారు. వైసీపీలో ఎప్పుడూ దూషణలకు పాల్పడేవారిని పక్కనబెట్టి.. బుగ్గన రాజేందర్ రెడ్డి వంటి వారితో మాట్లాడిస్తే పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని ఆ సందర్భంగా వారికి సూచించానని శివాజీ పేర్కొన్నారు.