Chandrababu: ఢిల్లీ వెళ్లి చంద్రబాబు ఏం సాధించారు?: జీవీఎల్

  • చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నారు
  • కేంద్రం ఇచ్చిన నిధుల గురించి లెక్క చెప్పరే?
  • ఏపీకి ఏం చేయట్లేదంటూ డ్రామాలాడుతున్నారు

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఏం సాధించారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. విశాఖపట్టణంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నారని, అనుభవం ఉన్న నాయకుడు ఎంత బాధ్యతగా మాట్లాడాలి? అని ప్రశ్నించారు.

ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధుల గురించి లెక్కచెప్పమంటే చెప్పట్లేదని, ఏపీకి కేంద్రం ఏం చేయట్లేదంటూ డ్రామాలాడుతున్నారని, ఒక సినిమా చూపించాలని చంద్రబాబు అనుకున్నారని, ప్రజలు, ప్రతిపక్షాలు ఆయనకు అసలు సినిమా చూపిస్తున్నాయని అన్నారు. 'ఆ సినిమా చూసి బెంబేలెత్తి చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ తర్వాత ఇంకెక్కడికెళతారు? ఇక సింగపూర్ వెళ్లాల్సిందే' అంటూ సెటైర్లు విసిరారు. ప్రజల్లో ఒక అపనమ్మకాన్ని సృష్టించి, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించవచ్చని చంద్రబాబు అనుకున్నారేమో, అసలు సినిమా ప్రజలే చూపిస్తారని, ఆ తర్వాత వాళ్లందరూ ఇంటికి వెళ్లడం ఖాయమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

Chandrababu
gvl
Visakhapatnam District
  • Loading...

More Telugu News