GVL: కోతల రాయుడు, అబద్ధాల రాయుడిగా ముఖ్యమంత్రి మిగిలిపోతారు: జీవీఎల్

  • దొంగ నాయకులపై ఐటీ దాడి చేస్తే ముఖ్యమంత్రికి భయమెందుకు
  • చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదు
  • ప్రభుత్వ పెద్దలు హాయ్ ల్యాండ్ ను కొట్టేయాలని చూశారని ఆరోపణ

ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు  విమర్శలు గుప్పించారు. వ్యాపారులు, దొంగ నాయకులపై ఐటీ దాడులు చేస్తే ముఖ్యమంత్రికి ఎందుకంత భయమన్నారు. చంద్రబాబు కోతల రాయుడు, అబద్ధాల రాయుడిగా మిగిలిపోతారన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదని, అప్పులు, ఆర్భాటాలేనని ఆరోపించారు. ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే అన్ని పార్టీలు ఖండించడం సహజమన్నారు. జగన్ పై దాడి కేసును ‘ చంద్రన్న బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ తోనే విచారణ చేయిస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. మేం చేస్తే ఈ స్థాయిలో చేయమంటూ ఓ మంత్రి అనడం ఏంటన్నారు.

GVL
BJP
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News