raghu: నేను జాతకాలు బాగానే నమ్ముతాను: కమెడియన్ రఘు

  • నాకు మొదటి నుంచి భక్తి ఎక్కువే 
  • తరచూ అయ్యప్ప మాల వేస్తాను
  • ఆలయాలకు ఎక్కువగా వెళతాను  

ఒక వైపున అమాయకత్వాన్ని .. మరో వైపున తనకంటే తోపు లేడనే బిల్డప్ ను తన పాత్రల ద్వారా వ్యక్తం చేస్తూ రఘు అందరినీ నవ్విస్తుంటాడు. అలాంటి రఘు .. ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు.

"మొదటి నుంచి కూడా నాకు దేవుడంటే భక్తి వుంది .. భయమూ వుంది. ఏదైనా షూటింగ్ కోసమని ఎక్కడికైనా వెళితే, ఆ చుట్టుపక్కల దేవాలయాలు ఏమున్నాయనేది ముందుగానే నోట్ చేసి పెట్టుకుంటాను. సమయాన్ని బట్టి ఆ దేవాలయాలకి వెళ్లి వస్తుంటాను. తరచుగా శ్రీశైలం వెళ్లడం .. అయ్యప్ప మాల వేసుకోవడం చేస్తుంటాను. పుట్టినరోజున మాత్రం భార్యాపిల్లలతో ఏదో ఒక క్షేత్రానికి వెళ్లడం చేస్తుంటాను. జాతకాలు నమ్ముతాను .. జాతకం ప్రకారం ఉంగరాలు ధరిస్తుంటాను" అని చెప్పుకొచ్చాడు.  

  • Loading...

More Telugu News