srikanth: విభిన్నమైన కథాంశంతో 'ఆపరేషన్ 2019'

  • రాజకీయ నేపథ్యంలో మరో సినిమా 
  • కీలకపాత్రలో మంచు మనోజ్ 
  • వచ్చేనెల 9వ తేదీన విడుదల

శ్రీకాంత్ కథానాయకుడిగా గతంలో వచ్చిన 'ఆపరేషన్ దుర్యోధన' అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఆ సినిమా శ్రీకాంత్ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచింది. ఇప్పుడు అదే తరహాలో శ్రీకాంత్ 'ఆపరేషన్ 2019' అనే సినిమా చేశాడు. కరణం బాబ్జీ దర్శకత్వం వహించిన ఈ  సినిమా, సమకాలీన రాజకీయాల నేపథ్యంలో నిర్మితమైంది.

ఒక సాధారణ వ్యక్తి రాజకీయ నాయకుడు అయితే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? అనే కథాంశంతో ఈ సినిమా కొనసాగనుంది. ఈ సినిమా ఏ పార్టీనీ ఉద్దేశించి ఉండదనీ .. ప్రజల తరఫున పోరాడేదిగా ఉంటుందని శ్రీకాంత్ చెప్పాడు. ఇది 'ఆపరేషన్ దుర్యోధన'కి సీక్వెల్ కాదనీ .. వచ్చేనెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని అన్నాడు. రాజకీయ నేపథ్యమే అయినప్పటికీ వాటిని ఆవిష్కరించే తీరు కొత్తగా ఉంటుందని చెప్పాడు. ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండటం విశేషం.     

  • Loading...

More Telugu News