Chiranjeevi: నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి మృతి పట్ల చిరంజీవి సంతాపం

  • కుటుంబ సభ్యులకు సానుభూతి 
  • గుండె సంబంధిత వ్యాధితో చెన్నైలో డి.శివప్రసాద్ మృతి
  • 1987లో ‘కామాక్షీ మూవీస్ బ్యానర్’ ప్రారంభం

గుండె సంబంధిత వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్న కామాక్షి మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి(62) చెన్నైలోని అపోలో హాస్పిటల్లో మృతి చెందారు. ఆయన మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ప్రముఖ నిర్మాత, కామాక్షి మూవీస్ అధినేత డి.శివ ప్రసాద్ రెడ్డి నాతో ‘ముఠా మేస్త్రీ’ చిత్రాన్ని నిర్మించారు. నాకు ఆయన మంచి మిత్రుడు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అన్నారు. డి. శివప్రసాద్ కొడుకు చందన్ కు ఫోన్ చేసి సానుభూతిని తెలియజేశారు.

ఇదిలావుండగా ‘కామాక్షి మూవీస్ బ్యానర్’ను డి.శివ ప్రసాద్ రెడ్డి 1987లో ప్రారంభించారు. శ్రావణ సంధ్య, విక్కీ దాదా, ఆటో డ్రైవర్, సీతారామరాజు, ముఠా మేస్త్రీ, అల్లరి అల్లుడు, నేనున్నాను, కింగ్, కేడీ, రగడ, బాస్, దడ, గ్రీకు వీరుడు లాంటి పలు విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు

  • Loading...

More Telugu News