Balkasuman: కేటీఆర్ బచ్చా అయితే ఉత్తమ్ లుచ్చా: ఎంపీ బాల్క సుమన్

  • నోట్ల కట్టలతో తెలంగాణకు చంద్రబాబు
  • తెలంగాణలో ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు
  • ద్రోహుల కూటమికి బుద్ధి చెప్పాలని పిలుపు

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ గురించి అవాకులు, చవాకులు పేలితే ఊరుకోబోమని, ఉత్తమ్ ఖబడ్దార్ అని హెచ్చరించారు. కేటీఆర్ బచ్చా అయితే ఉత్తమ్ లుచ్చా అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

సెన్సేషన్ ఈవెంట్ ను కేటీఆర్ కు ముడిపెట్టడం హాస్యాస్పదమని మండిపడ్డారు. ద్రోహుల కూటమికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. నోట్ల కట్టలతో తెలంగాణకు వస్తున్నారని చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. తెలంగాణకు ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులను పంపించారని, అధికారులు గ్రామాల్లో టీడీపీ కార్యకర్తల్లా తిరుగుతున్నారని ఆరోపించారు. ఈ విషయాలను గవర్నర్, డీజీపీ పరిగణనలోకి తీసుకోవాలని బాల్క సుమన్ కోరారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News