Anandbabu: జగన్ మోహన్ రెడ్డి ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తో చెప్పాలి: మంత్రి ఆనంద్ బాబు

  • గవర్నర్ వ్యవస్థకు కళంకం తెస్తున్నారు
  • ప్రతిపక్ష నేత జగన్ పై విమర్శలు
  • రాష్ట్ర ప్రజలను అవమానించారు

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పై మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శలు కురిపించారు. బీజేపీ, వైసీపీ, జనసేన, టీఆర్ఎస్ పార్టీలకు గవర్నర్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థకే  కళంకం తెస్తున్నారని విమర్శించారు.

ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తో వెల్లడించాలన్నారు. ఏపీకి సీఎం కావాలని ప్రయత్నిస్తున్న వ్యక్తికి ఏపీ వ్యవస్థలపై నమ్మకం లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థపై నమ్మకం లేదని వ్యాఖ్యానించి రాష్ట్ర ప్రజలను అవమానించారని ఆరోపించారు.

Anandbabu
Telugudesam
Narasimhan
Governor
Andhra Pradesh
  • Loading...

More Telugu News