Andhra Pradesh: ఢిల్లీ టూర్.. చంద్రబాబుతో సమావేశమైన కేజ్రీవాల్, శరద్ యాదవ్!

  • కేంద్రం, గవర్నర్ల వ్యవహారశైలిపై చర్చ
  • మరికాసేపట్లో మీడియా సమావేశం
  • పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్న సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు తొలుత టీడీపీ పార్లమెంటు సభ్యులతో భేటీ అయ్యారు. అనంతరం లోక్ తంత్రిక్ జనతాదళ్ వ్యవస్థాపకుడు శరద్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో చంద్రబాబు సమావేశమయ్యారు. కేంద్రం వ్యవహారశైలి, రాష్ట్రాల పాలన వ్యవహారాల్లో గవర్నర్ల జోక్యంపై ఈ భేటీలో చర్చించారు. మరికాసేపట్లో చంద్రబాబు జాతీయ మీడియాతో మాట్లాడుతున్నారు.

ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయకపోవడం, టీడీపీ నేతలు, మద్దతుదారులు లక్ష్యంగా జరుగుతున్న ఐటీ దాడులను చంద్రబాబు జాతీయ మీడియా సమావేశంలో ప్రస్తావించనున్నారు. రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుతో పాటు సీబీఐలో జరుగుతున్న అధికార పోరుపై మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా ‘డెమోక్రసీ ఇన్‌ డేంజర్‌.. టార్గెట్‌ ఏపీ’ పేరుతో సీఎం చంద్రబాబు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు.

Andhra Pradesh
Chandrababu
New Delhi
Arvind Kejriwal
sharad yadav
national media
press meet
  • Loading...

More Telugu News