keerti suresh: దర్శకత్వంపై ఆసక్తి చూపుతోన్న కీర్తి సురేశ్

  • తెలుగులో కీర్తి సురేశ్ కి మంచి క్రేజ్ 
  • తమిళంలో వరుస సినిమాలు 
  • భవిష్యత్తులో మెగాఫోన్ పట్టాలనే ఆలోచన 

తెలుగు ... తమిళ భాషల్లో కీర్తి సురేశ్ కి మంచి క్రేజ్ వుంది. 'మహానటి'తో ఈ రెండు భాషల్లోను మంచి మార్కులను కొట్టేసిన కీర్తి సురేశ్, 'పందెం కోడి 2'లో తన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. ఇక స్టార్ హీరో విజయ్ సరసన ఆమె చేసిన 'సర్కార్' .. తెలుగు .. తమిళ భాషల్లో దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంచితే, కీర్తి సురేశ్ కి, దర్శకత్వంపై ఆసక్తి ఉంది. అందుకే, సెట్లోకి వెళ్లాక కెమెరా ముందు తన పని పూర్తయితే, వెంటనే కెమెరా వెనక్కి వచ్చి దర్శకత్వ విభాగంలోని అంశాలపై అవగాహన పెంచుకుంటూ ఉంటుందట. ఇక షూటింగు లేని సమయాల్లో తానే సొంతంగా కథలు రాసుకుంటూ వుంటుందట. కథానాయికగా అవకాశాలు తగ్గిన తరువాత మెగాఫోన్ పట్టాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ విధంగా సంసిద్ధమవుతోందని చెబుతున్నారు. మొత్తానికి కీర్తి సురేశ్ చాలా పెద్ద ప్రయత్నం పైనే వుందన్న మాట!   

keerti suresh
  • Loading...

More Telugu News