venkatesh: 'వెంకీ మామా' ప్రాజెక్టు గురించి ఫిల్మ్ నగర్ టాక్

- వెంకీ - చైతూ హీరోలుగా 'వెంకీమామా'
- పూర్తి స్క్రిప్ట్ ను రెడీ చేసిన బాబీ
- అసంతృప్తిని వ్యక్తం చేసిన సురేశ్ బాబు
ఈ మధ్య కాలంలో వెంకటేశ్ ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాలకి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు. అలా ఆయన ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' అనే మల్టీ స్టారర్ మూవీ చేశారు. ఈ సినిమా తరువాత ఆయన బాబీ దర్శకత్వంలో 'వెంకీ మామా' అనే మరో మల్టీ స్టారర్ చేయవలసి వుంది. నాగచైతన్య మరో హీరోగా చేయనున్న ఈ సినిమా, ఇటీవలే పూజా కార్యక్రమాలను కూడా జరుపుకుంది.
