animal friend: వానరాల ప్రేమికుడు... రొట్టెలతో కడుపు నింపుతాడు!

  • మూగజీవాల ఆకలి తీరుస్తున్న స్వప్నిల్‌ సోని
  • పదేళ్లుగా ఇదే వ్యాపకం
  • ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా సాయం కొనసాగింపు

అతని పేరు స్వప్నిల్‌ సోని. అహ్మదాబాద్‌ నగర వాసి. పెద్ద ధనవంతుడేమీ కాదు. కానీ మానవత్వం ఉన్న మనిషి. మూగజీవాలంటే పంచ ప్రాణాలు. ముఖ్యంగా వానరాలంటే (కోతులు) అతనికి ఇష్టం. అందుకే పదేళ్లుగా వాటి ఆకలి తీర్చి ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నాడు.

 అటవీ ప్రాంతాలు హరించుకు పోతుండడంతో నిలువ నీడ కోల్పోతున్న మూగజీవాలు ఆహారాన్ని వెతుక్కుంటూ జనావాసాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇలా వచ్చిన మూగ జీవాల ఆకలిదప్పుల గురించి ఆలోచించే వారికంటే, వెంటాడి తరుముతున్న వారే అధికం. కానీ తాను ఉంటున్న ప్రాంతానికి వస్తున్న వానరాల మనసు చదివాడు స్వప్నిల్‌ సోనీ.

ప్రతి సోమవారం 1700 రొట్టెలు కొనుగోలు చేస్తాడు. వానరాలకు ఆహారంగా పెడుతున్నాడు. గత పదేళ్లుగా అతను ఈ పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం అతని ఆర్థిక పరిస్థితి దిగజారింది. అయినా మూగజీవాల ఆకలి తీర్చే పని మానలేదు. ‘ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. నా సాయాన్ని కొనసాగిస్తాను. నా కొడుకును కూడా ఇందులో భాగస్వామిని చేస్తాను’ అంటున్న స్వప్నిల్‌ సోనీ గొప్పతనానికి హాట్సాఫ్‌.

  • Loading...

More Telugu News