Andhra Pradesh: టీడీపీ నేతలు అనుకుంటే జగన్ రోడ్డుపైనే కైమా.. కైమా అయిపోయేవారు!: కేశినేని నాని

  • జగన్ 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు
  • అయినా ఆయనపై చిన్నదాడి జరగలేదు
  • వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో దాడి కేంద్ర వైఫల్యమే

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నంపై టీడీపీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని స్పందించారు. రాష్ట్రమంతటా జగన్ వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేశారనీ, అప్పుడు ఏనాడూ ఆయనపై దాడులు జరగలేదని గుర్తుచేశారు. ఒకవేళ టీడీపీ నేతలు, కార్యకర్తలు జగన్ పై దాడి చేయాలనే అనుకుంటే ఆయన ఎప్పుడో రోడ్డుపై కైమా కైమా అయిపోయేవారని వ్యాఖ్యానించారు.

రాజకీయ నేతలను హత్య చేయాలన్న దురుద్దేశం తమకు లేదని కేశినేని స్పష్టం చేశారు. ఈ రోజు ఢిల్లీకి చేరుకున్న కేశినేని మీడియాతో మాట్లాడారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) వైఫల్యం కారణంగానే జగన్ పై దాడి జరిగిందన్నారు. జగన్ పై విమానాశ్రయంలో దాడిచేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.  

Andhra Pradesh
Telugudesam
Kesineni Nani
attack
Jagan
warning
comments
Visakhapatnam District
airport
murder
kill
prajasanklapa yatra
  • Loading...

More Telugu News