Kanna Lakshminarayana: దాడి గురించి ముందే తెలిసిన నటుడు శివాజీని ఎందుకు అరెస్ట్ చేయలేదు: కన్నా లక్ష్మీనారాయణ

  • శివాజీని ప్రశ్నిస్తే అన్ని వివరాలూ బయటకు వస్తాయి
  • ఇంకా ఎంతమందిపై దాడులకు ప్లాన్ చేశారన్న విషయం తెలుస్తుంది
  • పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న కన్నా

ఏపీలోని ఓ ప్రతిపక్ష నేతపై ప్రాణాపాయం లేకుండా దాడి జరుగుతుందని ముందే చెప్పిన నటుడు శివాజీని అరెస్ట్ చేసి ఎందుకు ప్రశ్నించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. దాడుల గురించి ముందే తెలిసిన అతడిని అరెస్ట్ చేసి విచారిస్తే, జగన్ పై జరిగిన దాడిని పోలీసులు తప్పించివుండేవారని అభిప్రాయపడ్డ ఆయన, ఈ విషయంలో ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతని అన్నారు.

'ఆపరేషన్ గరుడ' అని చెప్పుకు తిరుగుతున్న శివాజీని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే, ఇంకా ఏం జరగబోతున్నాయన్న సమాచారం రాబట్టవచ్చని, ఈ దిశగా పోలీసులు ఎందుకు అడుగులు వేయడం లేదని విమర్శించారు. శివాజీ వెనుక స్క్రిప్ట్, దర్శకత్వం చంద్రబాబుదే కాబట్టి, పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని కన్నా నిప్పులు చెరిగారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు శివాజీ పావుగా మారి ముందు నిలబడుతున్నాడని విమర్శించారు.

'ఆపరేషన్ గరుడ' గురించి శివాజీకి ఎవరు చెప్పారు? రాష్ట్రంలో ఏం జరగబోతున్నదన్న విషయాలు ఆయనకు ముందే ఎలా తెలుస్తున్నాయి? ఎవరి మీద హత్యాప్రయాత్నాలు జరగబోతున్నాయి? తదితరాలన్నీ బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినట్టు చెబుతుంటే, పోలీసులు ఎలా ఊరుకున్నారని అడిగారు.

Kanna Lakshminarayana
BJP
Chandrababu
Sivaji
Operation Garuda
  • Loading...

More Telugu News