Telangana: తూచ్.. నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు!: ధర్మపురి శ్రీనివాస్

  • ఎంపీగా చాలా మందిని కలుస్తుంటా
  • మర్యాదపూర్వకంగా రాహుల్ తో భేటీ
  • సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతా

తాను కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు చేరలేదని నిజామాబాద్ టీఆర్ఎస్ నేత ధర్మపురి శ్రీనివాస్ తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా తాను చాలామంది నేతలను కలుస్తూ ఉంటానని చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యానని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ రాములు నాయక్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు డీఎస్ చెప్పారు.

ఈరోజు ఉదయం ఢిల్లీకి చేరుకున్న డీఎస్ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ తో సమావేశమయ్యారు. అనంతరం తిరిగివెళుతూ మీడియాతో ముచ్చటించారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీని ఈరోజు మర్యాదపూర్వకంగానే కలుసుకున్నట్లు డీఎస్ స్పష్టం చేశారు. తాను ఏం నిర్ణయాలు తీసుకుంటానో అన్నీ మీడియాకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు తన రాజకీయ భవితవ్యంపై మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు. అనంతరం అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు.

Telangana
TRS
Congress
dharmapuri srinivas
d srinivas
joined
Nizamabad District
Rahul Gandhi
  • Loading...

More Telugu News