Kerala: శబరిమలపై సుప్రీం తీర్పును వెనకేసుకొచ్చిన సందీపానందగిరి ఆశ్రమం సర్వనాశనం!

  • ఈ తెల్లవారుజామున ఘటన
  • ఆశ్రమంలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు
  • శిక్ష తప్పదని హెచ్చరించిన పినరయి విజయన్

శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి వయసు నిమిత్తం లేకుండా ఏ మహిళైనా వెళ్లవచ్చని ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును సమర్థించినందుకు తిరువనంతపురంలోని భగవద్గీత స్కూల్ డైరెక్టర్ స్వామి సందీపానంద గిరి ఆశ్రమాన్ని సర్వనాశనం చేశారు. ఈ తెల్లవారుజామున ఆశ్రమంలోకి జొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడి, ఆశ్రమానికి నిప్పు పెట్టారు. ఆవరణలో ఉన్న రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనానికి నిప్పింటించారు.

2.30 గంటల సమయంలో నిరసనకారులు ఆశ్రమంలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆశ్రమాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు. కాగా, గతంలోనే సందీపానంద గిరికి పలువురి నుంచి హెచ్చరికలు, బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది.

కాగా, ఈ దాడిపై స్పందించిన కేరళ సీఎం పినరయి విజయన్, భౌతిక దాడులతో ఆలోచనలను, సమాజంలో జరిగే మార్పులను మార్చలేమని అన్నారు. చట్టాన్ని చేతుల్లోకే తీసుకునే అధికారాన్ని ఎవరికీ ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఆశ్రమంపై దాడి చేసిన వారికి శిక్ష తప్పదని చెప్పారు.

Kerala
Sabarimala
Sandeepananda Giri
Ashramam
  • Error fetching data: Network response was not ok

More Telugu News