Tollywood: నాగార్జునతో ఎన్నో హిట్ చిత్రాలు చేసిన కామాక్షీ మూవీస్ అధినేత శివప్రసాదరెడ్డి కన్నుమూత

  • ఈ ఉదయం కన్నుమూసిన శివప్రసాదరెడ్డి
  • గత కొంతకాలంగా హృదయ సంబంధిత వ్యాధితో బాధ
  • 1985లో కామాక్షీ మూవీస్ స్థాపించి హిట్ చిత్రాల నిర్మాణం

ప్రముఖ నిర్మాత డి శివప్రసాదరెడ్డి ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. గత కొంతకాలంగా హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఇటీవల చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా జరిగింది. సర్జరీ తరువాత గత రాత్రి ఆయన ఆరోగ్యం విషమించి మరణించినట్టు తెలుస్తోంది.

1985లో కామాక్షీ మూవీస్ బ్యానర్ ను స్థాపించిన ఆయన అగ్రహీరోలతో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. కార్తీకపౌర్ణమి, శ్రావణ సంధ్య, విక్కీదాదా, ముఠామేస్త్రీ, అల్లరి అల్లుడు, ఆటో డ్రైవర్, సీతారామరాజు, ఎదురులేని మనిషి, నేనున్నాను, బాస్, కింగ్, కేడీ, రగడ, దడ, గ్రీకువీరుడు తదితర చిత్రాలను నిర్మించారు. శివప్రసాదరెడ్డి మృతికి నాగార్జున సంతాపాన్ని వెలిబుచ్చారు. ఆయన మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని అన్నారు. తెలుగు, తమిళ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా సంతాపాన్ని వెలిబుచ్చారు.

Tollywood
Sivaprasad Reddy
Kamakshi Movies
Nagarjuna
  • Loading...

More Telugu News