Spicejet: విమానయాన సంస్థల్లో పండుగ జోరు.. ఇండిగో, స్పైస్‌జెట్ పోటాపోటీ ఆఫర్లు!

  • దేశీయ విమానయాన సంస్థల్లో పోటీ
  • ఇండిగో రూ.899 ఆఫర్‌కు పోటీగా స్పైస్‌జెట్ రూ.888 టికెట్
  • రేపటితో ఆఖరు

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈకామర్స్ సంస్థల పండుగ ఆఫర్ల హోరు అయిపోయింది. ఇప్పుడు విమానయాన సంస్థలు ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. చవక ధరల్లో టికెట్లను ఆఫర్ చేస్తూ ప్రయాణికులను పెంచుకునే మార్గాన పడ్డాయి. మూడు రోజుల క్రితం చవక ధరల విమానయాన సంస్థ ఇండిగో రూ.899తో దేశీయ ప్రయాణాలకు టికెట్లను ఆఫర్ చేయగా, తాజాగా మరో సంస్థ స్పైస్ జెట్ రంగంలోకి దిగింది.

దేశంలోని ఎక్కడికైనా అతి తక్కువ ధరతో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. అందులో భాగంగా ఇండిగో కంటే తక్కువకే రూ.888కే టికెట్లను ఆపర్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది నవంబరు 8 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 మధ్య ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ నెల 28 వరకు ఆఫర్ల టికెట్లను విక్రయించనున్నట్టు స్పైస్ జెట్ తెలిపింది. ఇటీవల ఇండిగో రూ.899తో 10 లక్షల సీట్లను అందుబాటులో ఉంచినట్టు ప్రకటించింది. కేవలం మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఆఫర్ శుక్రవారంతో ముగిసింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News