Jagan: వైఎస్ జగన్ పాదయాత్రకు తాత్కాలిక విరామం!

  • రెండు రోజుల క్రితం జగన్ పై దాడి
  • చికిత్స అనంతరం జగన్ డిశ్చార్జ్
  • నేడు, రేపు పాదయాత్ర రద్దు

రెండు రోజుల క్రితం వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి నేపథ్యంలో, వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో, ప్రజాసంకల్ప పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. నేడు, రేపు రెండు రోజుల పాటు యాత్రను రద్దు చేసినట్టు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రామ్స్‌ కమిటీ కో-ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

నేటి సాయంత్రానికి జగన్ కు తగిలిన గాయంపై వైద్యుల పూర్తి స్థాయి నివేదిక రానుందని వెల్లడించిన ఆయన, ఆపై పార్టీ నేతలతో సమావేశమై, పాదయాత్ర ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుందన్న అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాగా, సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందిన జగన్, నిన్న డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే.

Jagan
Padayatra
Attack
Rest
  • Loading...

More Telugu News