Chandrababu: నన్ను తక్కువగా అంచనా వేయొద్దు!: కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు

  • రేపటి నుంచి ఏం జరుగుతుందో మీరే చూడండి
  • కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
  • రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు

విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అధినేత జగన్ పై దాడి అనంతరం ఏపీలో జరుగుతున్న పరిణామాలు తెలిసిందే. ఈ కుట్రకు తెలుగుదేశం ప్రభుత్వమే కారణమని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

 అమరావతిలో ఈరోజు జరిగిన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, ‘నన్ను తక్కువగా అంచనా వేయొద్దు. రేపటి నుంచి ఏం జరుగుతుందో మీరే చూస్తారు’ అని అన్నారట. ఇదిలా ఉండగా, రేపు ఉదయం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీకి కేంద్రం సాయం చేయకపోవడం, జరుగుతున్న ఐటీ దాడులు, జగన్ దాడి ఘటన, గవర్నర్ తీరు తదితర అంశాలపై ముందుగా ఏపీ భవన్ లో టీడీపీ ఎంపీలతో ఆయన చర్చించనున్నారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు జాతీయ మీడియాతో చంద్రబాబు మాట్లాడనున్నారు.

Chandrababu
amaravathi
collectors conference
  • Loading...

More Telugu News