YSRCP: వైసీపీ నేతల క్రిమినల్ మైండ్ అందరికీ తెలుసు: గంటా

  • చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేసే వ్యక్తి కాదు
  • స్టేట్‌మెంట్ ఇవ్వకుండా నిరాకరించడమేంటి
  • జగన్ నాటకం చారిత్రక తప్పిదం

ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన దాడి విషయమై అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి గంటా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేసే వ్యక్తి కాదని ఆయన స్పష్టం చేశారు.

వైసీపీ నేతల క్రిమినల్ మైండ్ అందరికీ తెలుసంటూ మండిపడ్డారు. పోలీసులకు స్టేట్‌మెంట్ ఇవ్వకుండా నిరాకరించడమేంటని ఆయన ప్రశ్నించారు. జగన్ నాటకం చారిత్రక తప్పిదమన్న గంటా.. ఆ నాటకం ఎక్కడా రక్తికట్టలేదన్నారు.

YSRCP
Jagan
Chandrababu
Ganta Srinivasa Rao
Police
Statement
  • Loading...

More Telugu News