Jagan: నేను రాయాలనుకున్నదంతా పేపర్‌లో రాశాను.. తీసుకోండి సార్!: నిందితుడు శ్రీనివాసరావు

  • ఉదయం అంతా విచారణ
  • కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
  • శ్రీనివాసరావుకు భారీ బందోబస్తు

వైసీపీ అధినేత జగన్‌పై దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావు ‘నేను రాయాలనుకున్నదంతా పేపర్‌లో రాశాను.. తీసుకోండి సార్’ అని మీడియాకు వెల్లడించాడు. నేటి ఉదయమంతా అతనిని విచారించిన పోలీసులు.. వైద్య పరీక్షల అనంతరం భారీ బందోబస్తు నడుమ విశాఖ సెషన్స్ కోర్టులో హాజరపరిచారు. కోర్టు నుంచి బయటకు వస్తున్న శ్రీనివాసరావును మీడియా ప్రశ్నించగా, తాను చెప్పాలనుకున్నదంతా పేపర్‌లో రాశానని అన్నాడు. ఇదిలా ఉంచితే, హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్న జగన్ నేటి మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

Jagan
Srinivasa Rao
Vizag
Court
  • Loading...

More Telugu News