bhumana karunakar reddy: రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి, గవర్నర్‌ను కలుస్తాం: భూమన కరుణాకర్ రెడ్డి

  • జగన్ ఘటనపై వైసీపీ నేతల కీలక భేటీ నిర్వహించాం 
  • స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలి
  • కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని జగన్‌ని కోరాం

వైఎస్ జగన్‌‌పై వైజాగ్‌‌లో దాడి, అనంతర పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతల కీలక భేటీ జరిగింది. భేటీ ముగిసిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్‌పై జరిగిన దాడిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ముఖ్య నాయకులు అందరూ రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖ మంత్రి, గవర్నర్‌ను కలిసి న్యాయం చేయాలని కోరనున్నామని వెల్లడించారు.

దాడి నేపథ్యంలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని జగన్‌ను కోరామని, విశ్రాంతి అనంతరం పాదయాత్రలో పాల్గొనాలని జగన్‌ను కోరామని భూమన తెలిపారు. దాడి పట్ల, జగన్‌ను భౌతికంగా నిర్మూలించాలనే కుట్రను ప్రజల్లోకి తీసుకెళ్లేలాగా కార్యక్రమాలు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించామని తెలిపారు.

bhumana karunakar reddy
ys jagan
YSRCP
  • Loading...

More Telugu News