Narasimhan: గవర్నర్ అలా ప్రవర్తించడం ఎంతవరకు సబబు?: ధూళిపాళ్ల

  • నేరుగా డీజీపీని సమాచారం అడగడమేంటి?
  • గవర్నర్ అలా ప్రవర్తించడం ఎంత వరకు సబబు
  • ఎయిర్‌పోర్టులో దాడి జరగడమేంటి?

గవర్నర్ నరసింహన్ తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన శైలిలో గవర్నర్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నేడు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకవైపు తిత్లీ తుపాను కారణంగా సర్వం కోల్పోయి ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకోని గవర్నర్.. ప్రతిపక్ష నేత జగన్ విషయంలో మాత్రం వెంటనే స్పందించడమేంటని ధూళిపాళ ధ్వజమెత్తారు.

జగన్‌పై దాడి జరిగిన వెంటనే గవర్నర్ నేరుగా డీజీపీని సమాచారం అడగటాన్ని ఆయన తప్పుబట్టారు.  ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఒక గవర్నర్ అలా ప్రవర్తించడం ఎంత వరకూ సబబని ఆయన ప్రశ్నించారు. పాదయాత్ర పేరుతో జగన్ రాష్ట్రమంతా తిరిగినా ఎలాంటి ఘటనలూ చోటు చేసుకోలేదని... అంత సెక్యూరిటీ ఉండే ఎయిర్‌పోర్టులో ఎలా జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే ఎయిర్‌పోర్టులోనే రక్షణ లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు.

Narasimhan
Dhulipala Narendra Kumar
Chandrababu
Jagan
Titli Cyclone
  • Loading...

More Telugu News