ys jagan: ఏపీ పోలీస్ పై నమ్మకం లేదన్న వ్యక్తి మూడు వేల కిలో మీటర్లు ఎలా ప్రయాణించారు?: మంత్రి జవహర్

  • జగన్ నాటకం వ్యూహాత్మక తప్పిదం
  • గవర్నర్, సీఎం కేసీఆర్ పరామర్శల్లో ఆంతర్యమేమిటి?
  • హత్యకు ప్రతిహత్యలు టీడీపీ సంస్కృతి కాదు

ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న, స్టేట్ మెంట్ ఇచ్చేందుకు నిరాకరించిన జగన్ తన పాదయాత్ర ద్వారా మూడు వేల కిలో మీటర్లు ఎలా ప్రయాణించారని మంత్రి జవహర్ ప్రశ్నించారు. జగన్ నాటకం వ్యూహాత్మక తప్పిదమని విమర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ పైనా ఆయన విమర్శలు చేశారు. తెలంగాణలోని కొండగట్టులో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో అరవై మంది చనిపోయారని, మృతి చెందిన వారి కుటుంబాలను కనీసం ఆయన పరామర్శించలేదని అన్నారు. అలాంటిది, జగన్ దాడి ఘటనపై వెంటనే ఆరా తీశారని అన్నారు. జగన్ కు గవర్నర్, సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతల పరామర్శల్లో ఆంతర్యమేమిటి? అని ప్రశ్నించారు. హత్యకు ప్రతిహత్యలు టీడీపీ సంస్కృతి కాదని, మోదీ- అమిత్ షా ఆడిస్తున్న తోలుబొమ్మల ఆటలో అంతా ఆడుతున్నారని విమర్శించారు.

ys jagan
minister jawahar
governer narasimhan
  • Loading...

More Telugu News