ys jagan: ఇది జగన్ చేసుకున్న రాజకీయ ఆత్మహత్య: మంత్రి గంటా శ్రీనివాసరావు

  • ఏపీ పోలీసులకు జగన్ స్టేట్ మెంట్ ఇవ్వరా!
  • ఆంధ్రుల ఆత్మగౌరవాన్నిజగన్ కించపరిచారు
  • జగన్నాటకం రక్తికట్టక పోగా సెల్ఫ్ గోల్ అయింది

ఏపీ పోలీసులకు స్టేట్ మెంట్ ఇవ్వనన్న జగన్ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కించపరిచారని, ఇది జగన్ చేసుకున్న రాజకీయ ఆత్మహత్య అని మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని అపహాస్యం చేసేలా జగన్ ప్రవర్తించారని, తెలంగాణ పోలీసులకు మాత్రమే తన స్టేట్ మెంట్ ఇస్తాననడం ఆత్మహత్యా సదృశమేనని విరుచుకుపడ్డారు.

 చిల్లర రాజకీయాలు చేసే సంస్కృతి చంద్రబాబుది కాదని, వేటకొడవళ్లు, బాంబుల సంస్కృతి ఎవరిదో అందరికీ తెలిసిందేనని, నిన్నటి జగన్నాటకం రక్తికట్టక పోగా సెల్ఫ్ గోల్ అయిందంటూ సెటైర్లు విసిరారు. తన పాదయాత్ర ద్వారా ప్రజాదరణ పొందలేకపోతున్న జగన్ శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు చూశారని ఆరోపించారు.

ys jagan
minister ganta
ap police
  • Loading...

More Telugu News