ys jagan: రేపు పవన్ పై దాడి జరిగినా ‘ఆపరేషన్ గరుడా’ అంటారేమో!: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

  • అసలు, ‘ఆపరేషన్ గరుడ’ అంటే ఏమిటి?
  • ఏపీలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలనా?
  • ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలి

‘ఆపరేషన్ గరుడా’లో భాగంగానే వైసీపీ అధినేత జగన్ పై దాడి జరిగిందన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒకవేళ రేపు పవన్ పై దాడి జరిగినా ‘ఆపరేషన్ గరుడా’ అంటారేమో! అని విమర్శించారు. అసలు, ‘ఆపరేషన్ గరుడ’ అంటే ఏమిటి? హీరో శివాజీని అమెరికాకు ఎవరు పంపారు? అని ప్రశ్నించారు.  

జగన్ పై జరిగిన దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని, ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సింగిల్ జడ్జి లేదా సీబీఐ తో విచారణ జరపాలని సూచించారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించిన విష్ణువర్ధన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని అన్నారు.

ys jagan
hero shivaji
bjp
Vishnu Vardhan Reddy
  • Loading...

More Telugu News