modi: మోదీతో గవర్నర్.. గవర్నర్‌తో లగడపాటి భేటీ!

  • ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ నరసింహన్
  • తెలుగు రాష్ట్రాల పరిస్థితులపై నివేదిక సమర్పణ
  • చర్చనీయాంశంగా మారిన గవర్నర్, లగడపాటిల భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ నరసింహన్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులపై ప్రధానికి గవర్నర్ నివేదిక సమర్పించారు. ఇదే సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పై దాడి అంశం కూడా చర్చకు వచ్చింది. మరోవైపు గవర్నర్ నరసింహన్ తో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీకి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఈ నేపథ్యంలో, ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతోందో అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 

modi
narasimhan
lagadapati
delhi
  • Loading...

More Telugu News