Andhra Pradesh: ఆసుపత్రి నుంచి బయటికి వచ్చిన జగన్.. సీఎం..సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించిన అభిమానులు!

  • ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన జగన్
  • అభిమానులకు అభివాదం చేసిన నేత
  • భారీగా చేరుకున్న అభిమానులు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జగన్ ఆసుపత్రి బయటకు అడుగు పెట్టగానే ఆయన్ను చూసిన వైసీపీ నేతలు, కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. సీఎం.. సీఎం అంటూ నినాదాలతో సిటీ న్యూరో ఆసుపత్రి ప్రాంగణాన్ని హోరెత్తించారు. దీంతో అభిమానులకు చేతితో అభివాదం చేసిన జగన్ కారులో తన ఇంటికి ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా జగన్ ను కలుసుకునేందుకు, చూసేందుకు అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పోటెత్తడంతో తోపులాట చోటుచేసుకుంది.

నిన్న వైజాగ్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న జగన్ పై ఎయిర్ పోర్ట్ లో శ్రీనివాసరావు అనే యువకుడు కోడిపందేలకు వాడే కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి తర్వాత ప్రాథమిక చికిత్స తీసుకున్న జగన్ హైదరాబాద్ కు వచ్చి సిటీ న్యూరో ఆసుపత్రిలో చేరారు. గాయం లోతుగా కావడంతో వైద్యులు జగన్ చేతికి 9 కుట్లు వేశారు. ఈ దాడిని తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, పార్లమెంటు సభ్యురాలు కవిత, మంత్రి తలసాని సహా పలువురు ప్రముఖులు ఖండించారు.

Andhra Pradesh
Telangana]
YSRCP
Jagan
discharge
hospital
attack
knife
home
fans
party members
supporters
slogans
  • Loading...

More Telugu News