cbi: సీబీఐ చీఫ్ పై విచారణను రెండు వారాల్లో పూర్తి చేయండి: సుప్రీంకోర్టు
- తనను తొలగించడంపై సుప్రీంను ఆశ్రయించిన అలోక్ వర్మ
- రెండు వారాల్లోగా విచారణను పూర్తి చేయాలంటూ సీవీసీని ఆదేశించిన సుప్రీం
- తదుపరి విచారణ నవంబర్ 12కు వాయిదా
సీబీఐ చీఫ్ అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి రెండు వారాల్లో విచారణను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర విజిలెన్స్ కమిషన్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షిస్తారని తెలిపింది. తదుపరి విచారణను నవంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది.
సీబీఐ డైరెక్టర్ గా తనను తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పిటిషన్ ను విచారించింది. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా నియమితులైన మన్నెం నాగేశ్వరరావు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని సుప్రీం ఆదేశించింది.