Andhra Pradesh: కడపలో పడగ విప్పిన ఫ్యాక్షన్.. బాంబులతో దాడి చేసుకున్న ఇరువర్గాలు!

  • కాశీనాయన మండలం చిన్నాయపల్లిలో ఘటన
  • ఘర్షణగా మారిన వాగ్వాదం
  • నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

వైఎస్సార్ కడప జిల్లాలో ఫ్యాక్షన్ రక్కసి మరోసారి పడగ విప్పింది. ఈ రోజు ఉదయం ఇరువర్గాలు పరస్పరం నాటు బాంబులు విసురుకోవడంతో పరిస్థితి భీతావహంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం దాడికి పాల్పడినవారిని అరెస్ట్ చేశారు.

జిల్లాలోని కాశీనాయన మండలం చిన్నాయపల్లిలో రాజారెడ్డి, చిన్నప్పరెడ్డి వర్గాల మధ్య పాత గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఇరువర్గాల మధ్య మొదలైన వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారితీసింది. దీంతో రాజారెడ్డి, చిన్నప్పరెడ్డి వర్గాలు రెచ్చిపోయాయి.

పరస్పరం నాటు బాంబులు విసురుకుంటూ హల్ చల్ చేశాయి. దీంతో ఈ ప్రాంతంలో భీతావహ పరిస్థితి నెలకొంది. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం దాడికి పాల్పడ్డిన ఇరువర్గాలకు చెందిన వ్యక్తులను అరెస్ట్ చేశారు.

Andhra Pradesh
Kadapa District
faction
attack
bombs
country made
Police
kasinayana mandal
chinnayapalli village
fight
arrest
  • Loading...

More Telugu News