Jagan: నేను ఇప్పుడు పడుతున్న కష్టాలను ఎన్నడూ పడలేదు: చంద్రబాబు

  • నాపై కేంద్రం, పక్క రాష్ట్రం, విపక్షాల కుట్ర
  • అన్నింటినీ దీటుగా ఎదుర్కొంటున్నా
  • రాష్ట్రపతి పాలన పెట్టాలని చూస్తున్న కేంద్రం
  • చంద్రబాబు ఆరోపణలు

రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలూ తాను శ్రమిస్తుంటే, దుష్టశక్తులు అడుగడుగునా అడ్డుపడుతూ, తనను కష్టపెడుతున్నాయని కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇప్పుడు పడుతున్న కష్టాలను తన జీవితంలో ఎప్పుడూ పడలేదని వ్యాఖ్యానించిన ఆయన, తనపై కేంద్ర ప్రభుత్వం నుంచి పక్క రాష్ట్ర ప్రభుత్వం, స్వరాష్ట్రంలోని విపక్షాలు కుట్ర పన్నాయని ఆరోపించారు. వీటన్నింటినీ తాను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నానని చెప్పారు. నిన్న తాను పట్టించుకోకుంటే శాంతిభద్రతలు అదుపుతప్పేవని అభిప్రాయపడ్డ ఆయన, దాన్ని సాకుగా చూపించి, రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్టు ఈ పాటికే ప్రకటన వచ్చి వుండేదని అన్నారు.

Jagan
Chandrababu
Law and Order
Collectors Conference
  • Loading...

More Telugu News